
బింబిసార సినిమాతో అద్భుత విజయం సాధించాడు నందమూరి కల్యాణ్ రామ్. ఈసారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ తాజగా ఓ ఇంటర్వ్యూలో తన టాటూ సీక్రెట్ బయటపెట్టాడు.
'నా భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేసుకున్నాను. 2007లో నేను అనారోగ్యంపాలయ్యాను. నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టకుండా తనే స్వయంగా నన్ను కంటికిరెప్పలా చూసుకుంది. అమ్మ తన కొడుకును ఎలా చూసుకుంటుందో నన్ను అలా చూసుకుంది. నాకు ఇంజక్షన్ అంటేనే భయం.. కానీ తన కోసం పచ్చబొట్టు వేసుకుని ఆ భయాన్ని అధిగమించాను' అని చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్.
చదవండి: ఆధ్మాత్మిక సేవలో తమన్నా
Comments
Please login to add a commentAdd a comment