
నూతన దర్శకుడితో చేయాలన్నా, వినూత్న కాన్సెప్టులు ఎంచుకోవాలన్నా గట్స్ ఉండాలి. ఆ గట్స్ హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు పుష్కలంగా ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసుకుంటూ పోతాడు. తాజాగా ఆయన ఓ భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మల్లిడి వేణు అనే వ్యక్తిని దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. (చదవండి: హీరోయిన్‌గా... సావిత్రి ఆఖరి చిత్రం)
ఈ సినిమాను ఎన్టీఆర్ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఎలాగో నిర్మాత తనే కాబట్టి ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఇందులో కల్యాణ్ రావణుడిగా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రావణుడితో స్టెప్పులేసేందుకు తాజాగా అఫ్ఘన్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. 'లవ్ యాత్రి', 'దబాంగ్ 3' సినిమాల్లో తళుక్కున మెరిసిన వారినా హుస్సేన్‌తో ఓ ఐటమ్ సాంగ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇదే కనక నిజమైతే వారినా ఈ చిత్రం ద్వారా దక్షిణాదిన కాలు మోపడం ఖాయం.
'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమైన కల్యాణ్ రామ్ 'అతనొక్కడే'తో హిట్ అందుకున్నాడు. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా మంచి హిట్టు మాత్రం దొరకలేదు. కానీ అనిల్ రావిపూడి 'పటాస్'తో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచి వాడవురా?' సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది. (చదవండి: ఉప్పెన: జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్!)
Comments
Please login to add a commentAdd a comment