ఒకే వేదికపై ఎన్టీఆర్‌-బాలయ్య | Jr NTR And Balakrishna Attending 118 Pre Release Event | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై ఎన్టీఆర్‌-బాలయ్య

Published Mon, Feb 25 2019 5:06 PM | Last Updated on Mon, Feb 25 2019 5:09 PM

Jr NTR And Balakrishna Attending 118 Pre Release Event - Sakshi

‘యన్‌టిఆర్‌-కథానాయకుడు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై కనిపించిన ఎన్టీఆర్‌-బాలయ్య మళ్లీ ఇంతవరకు ఒకేచోట కలిసి కనబడలేదు. ఏదో మొక్కుబడిగా ఆ ఈవెంట్‌కు వచ్చాడని, అందుకే బయోపిక్‌పై ఎన్టీఆర్‌ కనీసం స్పందిచలేదని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఆ వేడుకలో ఇద్దరు ఒకేచోట కనబడేసరికి నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే మళ్లీ వీరిద్దరు ఒకేచోట కనపడి అభిమానులను ఆశ్చర్యపర్చనున్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌.. 118తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ను ఈరోజు(ఫిబ్రవరి 25)న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలయ్య, ఎన్టీఆర్‌లు హాజరుకానున్నారు. మరీ ఈ వేడుకలోనైనా.. ‘యన్‌టిఆర్‌’ పై యంగ్‌టైగర్‌ స్పందిస్తాడా లేదో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. షాలినీ పాండే, నివేధా థామస్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మించగా.. కెవి గుహన్‌ దర్శకత్వం వహించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement