బాబాయ్‌ స్పీచ్‌.. అబ్బాయ్‌ పాట్లు! | Nandamuri Balakrishna Speech At 118 Pre Release Event | Sakshi
Sakshi News home page

బాబాయ్‌ స్పీచ్‌.. అబ్బాయ్‌ పాట్లు!

Published Tue, Feb 26 2019 8:04 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

బాలయ్య వేదిక ఎక్కితే.. వచ్చే ప్రవాహం ఎటు పోతుందో.. ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు వైపుకు తీసుకువెళ్తాడో బాలయ్యకే తెలియదు. ఇప్పటికే బుల్‌ బుల్‌, సంభ్రమాశ్చర్యాలతో నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడేసుకోగా.. తాజాగా బాలయ్య మరోసారి దొరికిపోయాడు.

నిన్న (ఫిబ్రవరి 26) జగిన 118 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బాలయ్య కనీసం సినిమా పేరును కూడా సరిగ్గా పలకలేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. మూడుసార్లు సినిమా పేరును తప్పుగా పలికాడు. 118గా ఉన్న సినిమా పేరును బాలయ్య 189గా చెబుతూ ఉంటే.. వేదికపై ఉన్నవారు ఆశ్యర్యపోయారు. అప్పటికీ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు దగ్గరికి వచ్చి.. చెప్పినా సరిచేసుకోలేకపోయాడు. మళ్లీ చివర్లో.. 189 అంటూనే ముగించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కెవీ గుహన్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని ఈస్ట్‌కోస్ట్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటించారు. మార్చి 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement