మాస్ పటాస్ | Kalyanram's Pataas ready for a December splash | Sakshi
Sakshi News home page

మాస్ పటాస్

Published Sat, Nov 29 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

మాస్ పటాస్

మాస్ పటాస్

నచ్చిన కథలతో సినిమాలు తీస్తూ, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ తన అభిరుచికి అనుగుణంగా కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. ఈ చిత్రం టైటిల్ లోగోను, టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు కల్యాణ్‌రామ్ తెలిపారు.

మాస్ మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అనిల్ ఈ చిత్రాన్ని రూపొందించారనీ, ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో చేశాననీ కల్యాణ్‌రామ్ అన్నారు. డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రుతీ సోధీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సాయికుమార్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆశుతోష్ రాణా, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, నిర్మాణం: నందమూరి తారక రామారావు ఆర్ట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement