
తాజా ఖబర్
ఇటీవలే ‘షేర్’గా వచ్చిన నందమూరి కల్యాణ్‌రామ్, ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టు చేయనున్నారు...
* ఇటీవలే ‘షేర్’గా వచ్చిన నందమూరి కల్యాణ్‌రామ్, ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టు చేయనున్నారు, గోపీచంద్‌తో తాజాగా ‘సౌఖ్యం’ తీసిన రవికుమార్ చౌదరి ఇప్పుడు కల్యాణ్‌రామ్ కోసం ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
* నాని కెరీర్‌లో వేగం పెంచారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జనవరి నెలాఖరుకి పట్టాల మీదకు వెళుతోంది. మరోపక్క ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి యూవీస్ కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న మరో చిత్రం నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో మరో చిత్రానికి పచ్చజెండా ఊపారాయన. జెమినీ కిరణ్ నిర్మించనున్న ఆ చిత్రం మార్చిలో మొదలవుతుందట.
* సంక్రాంతికి రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రంలో నయనతార స్పెషల్ సాంగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అది కరెక్ట్ కాదని అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఆ స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో పాటు ఇద్దరు గెస్ట్ హీరోయిన్లు ఉంటారట. వాళ్లెవరనేది ఈ వారంలోనే తెలుస్తుంది.