
టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మిస్తుండగా తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. అక్కడ రెండు రోజుల క్రితం కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నపుడు కల్యాణ్ రామ్ గాయపడ్డారట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు తన ట్విట్టర్‌లో తెలిపారు. ' యాక్షన్ సీన్స్ జరుగుతున్నప్పుడు కల్యాణ్ గాయపడ్డారు. కానీ షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆయన ఈరోజు (శుక్రవారం) సెట్స్‌కు వచ్చారు. ప్రొఫెషన్ పైన ఆయనకున్న డెడికేషన్ కి హాట్సాఫ్' అని ట్వీట్ చేశారు.
కల్యాణ్ రామ్ మరోవైపు ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
Yesterday in Vikarabad, hero @nandamurikalyan sustained injuries & bruised his arm during the shoot of an intense scene for our #NKR15 . He completed the scene without complaint,and is back on set today with pain medication. Hats off for your professionalism sir 🙏🏻
— Mahesh S Koneru (@smkoneru) December 8, 2017
Comments
Please login to add a commentAdd a comment