సరికొత్త కల్యాణ్‌రామ్ కనిపిస్తాడు | NTR Arts banner in Puri New Movie | Sakshi
Sakshi News home page

సరికొత్త కల్యాణ్‌రామ్ కనిపిస్తాడు

Apr 29 2016 10:53 PM | Updated on Mar 22 2019 1:53 PM

సరికొత్త కల్యాణ్‌రామ్ కనిపిస్తాడు - Sakshi

సరికొత్త కల్యాణ్‌రామ్ కనిపిస్తాడు

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శక త్వంలో యన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.

- పూరి
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శక త్వంలో యన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి పూరీ జగన్నాథ్ కెమేరా స్విచాన్ చేయగా, చిన్న ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. దర్శకుడు కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ- ‘‘సరికొత్త స్టైల్‌లో సాగే కమర్షియల్ చిత్రమిది.

ఇప్పటివరకూ చూడని కొత్త కల్యాణ్ రామ్‌ని ఇందులో చూస్తారు. తన ఇమేజ్‌ని మరింత పెంచే చిత్రమవుతుంది. మేలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు కథ చెప్పినప్పట్నుంచీ ఎంతో ఎగ్జైట్ అవుతున్నా. ఈ చిత్రం నా కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. జగపతిబాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అదితీ ఆర్య కథానాయిక. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమేరా: ముఖేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement