వెయ్యి మందితో ఫైట్‌ | Nandamuri Kalyan Ram NKR21 spends Rs 8 crore on its climax sequence | Sakshi
Sakshi News home page

వెయ్యి మందితో ఫైట్‌

Published Wed, Jul 31 2024 12:02 AM | Last Updated on Wed, Jul 31 2024 12:10 AM

Nandamuri Kalyan Ram NKR21 spends Rs 8 crore on its climax sequence

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్‌కేఆర్‌ 21’ (వర్కింగ్‌ టైటిల్‌) క్లైమాక్స్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, సోహైల్‌ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 హైదరాబాద్‌ శివార్లలో వేసిన సెట్‌లో ముప్పై రోజులపాటు క్లైమాక్స్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. ‘‘క్లైమాక్స్‌ కోసం బ్రహ్మ కడలి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. పతాక సన్నివేశాల షూట్‌లో ప్రముఖ తారాగణంతోపాటు దాదాపు వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులుపాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశాం. రామకృష్ణ యాక్షన్‌ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement