Chiranjeevi And Others Congratulates To Sitharaman, Bimbisara Movie Team, Tweet Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi Tweet: బాక్సాఫీస్‌ కళ​ కళ.. సంతోషంలో స్టార్‌ హీరోలు..ట్వీట్స్‌ వైరల్‌

Published Sat, Aug 6 2022 10:55 AM | Last Updated on Sat, Aug 6 2022 12:27 PM

Chiranjeevi,Vijay Devarakonda Congratulates To Sitharaman, Bimbisara Movie Team - Sakshi

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ మళ్లీ కలకళలాడుతోంది. ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 5) విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు తొలి రోజే హిట్‌ టాక్‌ సంపాదించుకున్నాయి. దీంతో ఈ విజయాన్ని టాలీవుడ్‌ మొత్తం సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌ వచ్చేలా చేసిన సీతారామం, బింబిసార చిత్ర బృందానికి  తెలుగు హీరోలు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ రెండు చిత్రాల మేకర్స్‌కి మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్‌ టాక్‌ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్‌ చేశాడు.

సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్‌ హీరో అడివి శేష్‌ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్  ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement