NKR19 Update: Mythri Movie Makers Revealed Nandamuri Kalyanram Next Movie Title - Sakshi
Sakshi News home page

Nandamuri Kalyanram: కల్యాణ్ రామ్ 'అమిగోస్'.. ఆసక్తి పెంచుతోన్న ఫస్ట్‌ లుక్

Published Mon, Nov 7 2022 3:13 PM | Last Updated on Mon, Nov 7 2022 4:34 PM

Mythri Movie Makers Revealed Nandamuri Kalyanram Next Movie Title - Sakshi

బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్‌ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

(చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక‍్టర్ మరో సర్‌ప్రైజ్..!)

రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్‌ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్‌లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. 

బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 

అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముగ్గురు కల్యాణ్ రామ్‌లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్‌లో ఉన్నారు.

ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement