Rajendra reddy
-
ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు చివరికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఆయారాం, గయారాంలను గుర్తించి ప్యాకేజీ ఆఫర్లతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఆ పార్టీ ఓడిపోయాక అధికారం కోసం వైఎస్సార్సీపీ చెంత చేరిన నేతలే ఇప్పుడు టీడీపీ నేతల ప్యాకేజీలకు కక్కుర్తిపడుతున్నారు. నిఖార్సైన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వారిచ్చే ప్యాకేజీలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక టీడీపీ నేతల బరితెగింపును చూస్తున్న ఓటర్లు మాత్రం వారిని ఛీదరించుకుంటున్నారు. తాజాగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రూ.3 కోట్లు ఆఫర్ ఇవ్వడం బట్టబయలు కావడంతో టీడీపీ అభ్యర్థుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. వేమిరెడ్డి దంపతులు ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలను విచ్చలవిడిగా విసురుతున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ఎరవేస్తున్నారు. ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో మత్స్యకార గ్రామాల్లో దురాయి ఆచారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కొనేందుకు రూ.80 లక్షలకు బేరం పెట్టిన విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో వీరు తాజాగా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించారు. ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలు.. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తునారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు స్థానిక లీడర్లకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేశారు. వీరి పరిధిలో ఓట్లు వేయించే బాధ్యత మీదే అంటూ టార్గెట్లు పెడుతున్నారు. అలాగే, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కందుకూరు నియోజకవర్గాలతో పాటు తన సతీమణి పోటీచేస్తున్న కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రేట్లు ఫిక్స్చేసి ప్రలోభాలకు గురిచేయడం వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఆయారాం, గయారాంలను ఒకొక్కరిని రహస్యంగా తమ శిబిరాలకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బుచి్చరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు బ్యాంకు చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన నేత కావడం గమనార్హం. ఎన్నికల వేళ ప్యాకేజీ ఆఫర్ పెంచుకుని తిరిగి సొంత పార్టీలోకి మారారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాగే, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ కూడా ఇదే తరహా ప్యాకేజీలతో పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు. నేతలకు ప్యాకేజీలతో పాటు ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, ఆ డబ్బుల పంపిణీ బాధ్యత కూడా మీదే అని ఆశపెట్టి మరీ పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఏర్పాటుచేసుకున్న టీమ్‌తో వ్యవహారాలు నడిపిస్తున్నారు. రివర్స్ అవుతున్న ఓటర్లు.. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు మండల స్థాయి నేతలకు రూ.కోట్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్యాకేజీలు తీసుకున్న వారు ఈ దఫా ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డికి ఓట్లు వేద్దామని స్థానికులకు చెబుతుండడంతో ‘ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ల దగ్గర’.. అంటూ భగ్గుమంటున్నారు. తమకు సీఎం జగన్ రూ.లక్షల్లో సాయం అందించారని, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లకు ఓటేసి ఆయనకు ద్రోహం చేయలేమని ఓటర్లు తెగేసి చెబుతున్నారు. -
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన ఆడియో లీక్
-
నారాయణపేట నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందే అభ్యర్థులు ఎవరు...
నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాజేంద్రరెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి తరపున పోటీచేసి గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. రాజేందర్ రెడ్డి తన సమీప బహుజన లెప్ట్ ప్రంట్ అభ్యర్ధి శివకుమార్ రెడ్డిపై 15187 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రాజేందర్ రెడ్డికి 68787 ఓట్లు రాగా, శివకుమార్ రెడ్డికి 52580 ఓట్లు వచ్చాయి. శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఆశించి, రాకపోవడంతో తిరుగుబాటు చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పాండురెడ్డికి ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి సిటింగ్ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వై.ఎల్లారెడ్డి టిఆర్ఎస్లోకి వెళ్లి నారాయణపేట నుంచి కాకుండా మక్తల్ నుంచి పోటీచేసి ఓడిపోగా, నారాయణపేటలో తెలుగుదేశం తరపున పోటీచేసిన రాజేంద్రనాద్ రెడ్డి విజయం సాధించడం విశేషం. 2014లో రాజేంద్రనాధ్ రెడ్డి తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి శివకుమార్ రెడ్డిపై 2270 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన వి.కృష్ణకు 29278 ఓట్లు, ఇండిపెండెంటుగా పోటీచేసిన కె.ఆర్.పాండురంగారెడ్డికి 23591 ఓట్లు లభించాయి. ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి గెలుపొందగా అంతకుముందు మక్తల్‌లో 1994, 99లలో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో కొంతకాలం మంత్రి పదవి నిర్వహించారు. నారాయణపేటలో ఒకసారి బిసి వర్గం నేత ఎన్నికైతే, రెండుసార్లు రెడ్డి సామాజికవర్గం నేత ఎన్నికయ్యారు. నారాయణపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బీజేపీకి డిపాజిట్లు కూడా రావు 40 వేల మెజార్టీతో గెలుస్తాం
-
బీజేపీకి డిపాజిట్లు కూడా రావు 40 వేల మెజార్టీతో గెలుస్తాం
-
ఆసక్తిగా కల్యాణ్ రామ్ మూవీ టైటిల్.. సోషల్ మీడియాలో వైరల్
బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. (చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!) రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కల్యాణ్ రామ్‌లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్‌లో ఉన్నారు. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా
కల్యాణ్‌రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి, మాథ్యూ వర్గీస్, రాజీవీ పిళ్లై, రవి ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. -
కొనసీమ నిరసనలు.. విధ్వంసానికి పాల్పడితే ఊరుకునేది లేదు: డీజీపీ
-
కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు ఎత్తేయాలి
డీజీపీని కలిసిన టీపీసీసీ బృందం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను హత్య కేసులో ఇరికించడం అన్యాయమని, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిపై కేసులను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ బృందం రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ)ని కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్ర మార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు మంగళవారం డీజీపీని కలిశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో టీఆర్ఎస్ నేత మురళి హత్య కేసులో నిందితులు లొంగిపోయారని, హత్య చేసిన ట్టుగా వారు అంగీకరించారని చెప్పారు. ఈ హత్యకు సంబంధంలేని రాజేందర్ రెడ్డి, నేతలు శ్రీమాన్, శేఖర్‌లపై కుట్ర కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల కుట్రతోనే హత్య జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే రాజేందర్‌రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. సిరిసిల్ల దళితుల మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. -
సమ్మె విరమించిన న్యాయవాదులు
హైకోర్టు విభజన కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు తమ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. హైకోర్టు విభజనపై సానుకూల సంకేతాలు కనిపించినందును సమ్మెను విరమించనున్నట్లు తెలంగాణ న్యాయవాద జేఏసీ ఛైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి విధులకు హాజరు కానున్నట్లు వివరించారు. విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారని.. అన్నారు. అయితే సమ్మె విరమణ తాత్కాలికమే అని.. సమస్య పరిష్కారం కాకపోతే.. మళ్లీ ఉద్యమించేందుకు వెనకాడమని తెలిపారు. -
నన్ను డిక్టేట్ చేసే అధికారం మంత్రికి లేదు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని రసాభాసగా మారింది. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన ఆటంకాలపై మాట్లాడాలని రాజేంద్ర రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. దాంతో ఆగ్రహించిన రాజేంద్రరెడ్డి ... నేను ఏం మాట్లాడాలో మంత్రి ఎలా డిక్టేట్ చేస్తారంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దాంతో ఇటు టీడీపీ... అటు టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు జడ్పీ ఛైర్మన్ పోడియం వైపు దూసుకువెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి... టీడీపీ సభ్యులను శాంతింప చేశారు. టీడీపీ సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం రాజేంద్రరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
పోచారం... రైతుల పాలిట గ్రహచారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రి కావడం రైతుల పాలిట గ్రహచారమని టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలపై అవహేళనగా మాట్లాడిన పోచారం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగేవరకు సభను అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు.