నన్ను డిక్టేట్ చేసే అధికారం మంత్రికి లేదు | TDP MLA Rajendra reddy takes on jupally krishna rao | Sakshi
Sakshi News home page

నన్ను డిక్టేట్ చేసే అధికారం మంత్రికి లేదు

Published Fri, Sep 4 2015 1:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

TDP MLA Rajendra reddy takes on jupally krishna rao

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని రసాభాసగా మారింది. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన ఆటంకాలపై మాట్లాడాలని రాజేంద్ర రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు.

దాంతో ఆగ్రహించిన రాజేంద్రరెడ్డి ... నేను ఏం మాట్లాడాలో మంత్రి ఎలా డిక్టేట్ చేస్తారంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దాంతో ఇటు టీడీపీ... అటు టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు  జడ్పీ ఛైర్మన్ పోడియం వైపు దూసుకువెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి... టీడీపీ సభ్యులను శాంతింప చేశారు. టీడీపీ సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం రాజేంద్రరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement