సమ్మె విరమించిన న్యాయవాదులు
హైకోర్టు విభజన కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు తమ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. హైకోర్టు విభజనపై సానుకూల సంకేతాలు కనిపించినందును సమ్మెను విరమించనున్నట్లు తెలంగాణ న్యాయవాద జేఏసీ ఛైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి విధులకు హాజరు కానున్నట్లు వివరించారు. విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారని.. అన్నారు. అయితే సమ్మె విరమణ తాత్కాలికమే అని.. సమస్య పరిష్కారం కాకపోతే.. మళ్లీ ఉద్యమించేందుకు వెనకాడమని తెలిపారు.