నారాయణపేట నియోజకవర్గం
నారాయణపేట నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాజేంద్రరెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి తరపున పోటీచేసి గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రాజేందర్ రెడ్డి తన సమీప బహుజన లెప్ట్ ప్రంట్ అభ్యర్ధి శివకుమార్ రెడ్డిపై 15187 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రాజేందర్ రెడ్డికి 68787 ఓట్లు రాగా, శివకుమార్ రెడ్డికి 52580 ఓట్లు వచ్చాయి.
శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఆశించి, రాకపోవడంతో తిరుగుబాటు చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పాండురెడ్డికి ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి సిటింగ్ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వై.ఎల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి నారాయణపేట నుంచి కాకుండా మక్తల్ నుంచి పోటీచేసి ఓడిపోగా, నారాయణపేటలో తెలుగుదేశం తరపున పోటీచేసిన రాజేంద్రనాద్ రెడ్డి విజయం సాధించడం విశేషం.
2014లో రాజేంద్రనాధ్ రెడ్డి తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ధి శివకుమార్ రెడ్డిపై 2270 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన వి.కృష్ణకు 29278 ఓట్లు, ఇండిపెండెంటుగా పోటీచేసిన కె.ఆర్.పాండురంగారెడ్డికి 23591 ఓట్లు లభించాయి. ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి గెలుపొందగా అంతకుముందు మక్తల్‌లో 1994, 99లలో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో కొంతకాలం మంత్రి పదవి నిర్వహించారు. నారాయణపేటలో ఒకసారి బిసి వర్గం నేత ఎన్నికైతే, రెండుసార్లు రెడ్డి సామాజికవర్గం నేత ఎన్నికయ్యారు.
నారాయణపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment