
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక మూవీ మంచి విజయం సాధించిడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్ ట్విట్ చేస్తూ బింబిసార బ్లాక్‌బస్టర్‌గా నిలిపినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.
చదవండి: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
ఈ మేరకు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘2019లో బింబిసార షూటింగ్ ప్రారంభించినప్పుడు ఎప్పుడెప్పుడు పూర్తి చూసి ప్రపంచానికి ఈ చిత్రాన్ని పరిచయం చేయాలా ఆసక్తిగా ఎదురు చూశాం. కానీ కరోనా, లాక్‌డౌన్ వల్ల మా ఉత్సాహన్ని కాస్తా ఆందోళనగా మార్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూవీ లవర్స్ కోసం మా చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం మా బింబిసార టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది.
చదవండి: మళ్లీ ప్రేమించేందుకు సిద్ధమా?.. చై సమాధానం ఇదే!
థియేటర్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. చివరికి రిలీజ్ అనంతరం మా సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మా నీరిక్షణకు ఫలితం దక్కింది అనిపించింది’ అంటూ కల్యాణ్ రామ్ రాసుకొచ్చాడు. ఇక ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో భిన్నమైన కథగా వచ్చిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు.
Thank You ❤️#Bimbisara pic.twitter.com/PFH1ei9hhs
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) August 6, 2022
Comments
Please login to add a commentAdd a comment