
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, పాటలు, టీజర్‌తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్‌షిప్, ఎమోషన్ అనే పాయింట్‌కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్‌లకు కొదువుండదు. ఈ ట్రైలర్‌లకూడా పలు డైలాగ్‌లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్‌లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment