
Kalyan Ram Bimbisara Movie Teaser Released: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత‍్రం 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష‍్ణ. కె నిర‍్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్‌లైన్. వశిష్ట్ దర‍్శకుడిగా పరిచియమవుతున్న ఈ సినిమా టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమా టీజర్ 'బింబిసారుడి' పాత్ర గురించి పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది. 'ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే' అంటూ బింబిసారుడి పొగరు, పరాక‍్రమం, ధైర్యసాహాసాల గురించి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. బింబిసారుడిగా యుద్ధ రంగంలో కత్తి దూస్తూ కల్యాణ్ రామ్ అలరించారు.
సినిమాలో యుద్ధ సన్నివేశాలు భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బింబిసారుడిగా అలరించిన కల్యాణ్ రామ్ టీజర్ చివరలో ఈ జనరేషన్ యువకుడిలా కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తారా.. లేదా బింబిసారుడే ఈ జనరేషన్‌లోకి వస్తే ఎలా ఉంటుందో అని చూపిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ట్యాగ్‌లైన్ చూస్తే మాత్రం 'చెడు నుంచి మంచికి మారిన రాజు ప‍్రయాణం' అనే కోణంలోనే సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. టైమ్ ట్రావెల్‌లా కనిపిస్తున్న ఈ టీజర్‌లో విజువల్స్‌తోపాటు సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment