
బింబిసార సూపర్ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కల్యాణ్ రామ్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజాచిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేస్తున్న పోస్టర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తుండగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘‘హాయ్ దిస్ ఈజ్ మైఖెల్ ఫ్రమ్ కోల్‌కతా’’ అంటూ కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలువతుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment