MAA Elections 2021: Kalyan Ram Reaction On His Contesting Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: ‘మా’ రూమర్‌పై కాళ్యాణ్‌ రామ్‌ క్లారిటీ

Published Thu, Jun 24 2021 6:46 PM | Last Updated on Fri, Jun 25 2021 3:22 PM

Maa Elections 2021 Kalyan Ram Reacts Rumours Of Contesting Election - Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సి ఉండగా ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైనట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అధ్యక్ష పోటీలో బరిలోకి దిగిన పోటీదారులే గాక ఎన్నికలకు సంబంధించి వస్తున్న పుకార్లనే చెప్పాలి.

‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ రేసులో మరో పోటీదారుడిగా జూ.ఎన్టీఆర్‌ సోదరుడు కళ్యాణ్‌రామ్‌ ఉన్నట్లు  ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. తాజాగా దీనిపై కళ్యాణ్‌ రామ్‌ స్పందించారు.  ‘మా’ ఎన్నికలకు సంబంధించి తాను పోటీలో లేనని కళ్యాణ్‌రామ్‌ క్లారిటీ ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే తనకు లేదని, ఇది కేవలం రూమర్‌ మాత్రమే అని కొట్టిపారేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement