మనసు మార్చుకున్న గుణశేఖర్ | Gunasekhar to start a small buget film | Sakshi
Sakshi News home page

మనసు మార్చుకున్న గుణశేఖర్

Published Tue, May 31 2016 9:46 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

మనసు మార్చుకున్న గుణశేఖర్

మనసు మార్చుకున్న గుణశేఖర్

చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. భారీ చిత్రాలతో అలరించిన ఈ డైరెక్టర్ ఇటీవల రుద్రమదేవి సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కాకతీయ రాణి రుద్రమదేవి జీవితకథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాతో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ లీగ్లో చేరిపోయాడు. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు.

రుద్రమదేవి సినిమాకు సీక్వెల్గా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు గుణ. కానీ ఈ సినిమాకు తన అనుకున్న నటీనటులు ప్రస్తుతం ఖాళీగా లేకపోవటంతో ఆ ఆలోచనను వాయిదావేశాడు. ప్రస్తుతానికి అంతా కొత్తవారితో ఓ చిన్న సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్న గుణ, త్వరలోనే ఈ సినిమా వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement