ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ | Gunasekhar New Movie Titled As Euphoria | Sakshi
Sakshi News home page

Gunasekhar: 'శాకుంతలం'తో ఎదురుదెబ్బ.. ఇప్పుడు కొత్త సినిమా

Published Tue, May 28 2024 12:07 PM | Last Updated on Tue, May 28 2024 4:01 PM

Gunasekhar New Movie Titled As Euphoria

గుణశేఖర్ పేరు చెప్పగానే పెద్ద సెట్స్‌తో తీసే భారీ సినిమాలే గుర్తొస్తాయి. ఈయన గత రెండు సినిమాలు ఇలాంటివే. వాటితో ఘోరమైన నష్టాల్ని చవిచూసిన ఈయన ఇప్పుడు రూట్ మార్చాడు. యూత్‌ఫుల్ సోషల్ డ్రామా కథతో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. దీనికి 'యుఫోరియా' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

'ఒక్కడు' లాంటి మూవీతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గుణశేఖర్.. ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయడంలో పూర్తిగా తడబడ్డాడు. మహేశ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి హీరోలు అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. 2015లో 'రుద్రమదేవి' అనే పీరియాడికల్ మూవీతో పాస్ మార్కులు వేయించుకున్నారు. ఇదొచ్చిన ఏడేళ్ల తర్వాత అంటే గతేడాది 'శాకుంతలం'తో వచ్చారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫలితం అందుకుంది.

మధ్యలో రానాతో చేయాల్సిన 'హిరణ్యకశ్యప' వివాదంలో చిక్కుకుంది. ఇలా పలు సమస్యలు ఎదుర్కొన్న గుణశేఖర్.. ఇప్పుడు తనకు అలవాటైన భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండే యూత్‌ఫుల్ డ్రామా తీయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగానే 'యుఫోరియా' మూవీని ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారు.

(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే ప్రముఖ నటి విడాకులు? అసలు విషయం ఇది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement