
వేసవికే ‘రుద్రమదేవి’ : గుణశేఖర్
ఇంద్రకీలాద్రి : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు ఇచ్చారు.
అనంతరం గుణశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన రుద్రమదేవి చిత్రం విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నానన్నారు. తొలుత సంక్రాంతికి విడుదల చేయూలను కున్నామని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వేసవికి వారుుదా వేశామన్నారు.
మరో రూ.1.90 లక్షల బకాయిల వసూలు
ఇంద్రకీలాద్రి దిగువన కొబ్బరికాయలు, పూజా సామాగ్రితో పాటు స్పాట్ ఫొటోలు తీసే వారి నుంచి దేవస్థానానికి రావాల్సిన బకాయిలను శుక్రవారం వసూలు చేశారు. మొత్తం రూ.1.90లక్షల వసూలైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.