ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి | Rudramadevi in Oscar race | Sakshi
Sakshi News home page

ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి

Published Sat, Aug 13 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి

ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి

ఆస్కార్ అవార్డ్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీపడేందుకు మన భారతీయ సినిమా ఎంపిక ప్రక్రియ మొదలైంది. మన దేశం తరఫున ఎంట్రీగా ఏ సినిమాను పంపాలనే దానికి పలు భాషా చిత్రాలను  ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. తెలుగు నుంచి పోటీ పడే అరుదైన అవకాశాన్ని ‘రుద్రమదేవి’ దక్కించుకుంది.‘‘తెలుగువారి చరిత్రకు, రుద్రమదేవి చరిత్రకు ఉన్న గొప్పతనమే ఈ సినిమాను ఈ స్థాయి దాకా తీసుకెళ్లింది’’ అని ఈ సందర్భంగా చిత్రదర్శక-నిర్మాత గుణశేఖర్ పేర్కొన్నారు. భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఇలాంటి కొన్ని చిత్రాలను పరిశీలించి ఫైనల్‌గా మన దేశం తరఫున ఎంట్రీగా ఒక చిత్రాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement