
హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 'రుద్రమదేవి' చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ప్రశ్నించడం తప్పా?...' అంటూ ఆయన చేసిన ట్వీట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలు ప్రశ్నలు సంధించారు.
చారిత్రాత్మక చిత్రం ''రుద్రమదేవి''కి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదు...? మరో చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి''కి మినహాయింపు ఎందుకిచ్చారని గుణశేఖర్ ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ''రుద్రమదేవి'', మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని మండిపడ్డారు.
ప్రశ్నించడం తప్పా..? Is it Wrong to Question ? pic.twitter.com/SBdbz7y0CO
— Gunasekhar (@Gunasekhar1) November 15, 2017