Oscar race
-
ఆస్కార్ రేసులో...
ఆస్కార్ రేసులో హిందీ చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ రాణిగంజ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఇంజనీర్ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్ సింగ్ గిల్‌గా అక్షయ్ కుమార్ నటించారు. ఇక 96వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం యూనిట్ దరఖాస్తు చేసిందని బాలీవుడ్ టాక్. ఇదే తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో నిలిచి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్ రాణిగంజ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? నామినేషన్ దక్కించుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. -
ఆస్కార్‌పై కన్నేసిన అద్భుతం
లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ బరిలో ఈసారి ఓ అద్భుత చిత్రం నిలిచింది. యానిమేషన్ చిత్రాల బరిలో నిలిచిన ‘లవింగ్ విన్సెట్’ అవార్డు దక్కించుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది చిత్రం కాదు. పూర్తిగా చేత్తో గీసిన పెయిటింగ్‌లతో తెరకెక్కించింది. సుమారు 65,000 ఫ్రేమ్‌లు, ప్రపంచవ్యాప్తంగా 125 మంది పెయింటర్లు ఈ చిత్రం కోసం పని చేశారు. పోలాండ్లోని గ్దాన్స్క్ పట్టణంలో వీరంతా ఒకచోట చేరి ఈ చిత్రాన్ని రూపొందించారు. విన్సెంట్ వాన్ ఘో హత్య.. విచారణ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డోరోటా కోబైలా, హూ వెల్చ్మన్లు దర్శకులు. నిజానికి కోబైలా.. 2008లో ఏడు నిమిషాలతో షార్ట్ ఫిలింగా దీనిని విడుదల చేశారు. తర్వాత దీనిని పూర్తి స్థాయి సినిమాగా రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. పాత్రలకు డబ్బింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా... అన్ని హంగులతో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో నిర్మించి 2017లో విడుదల చేశారు. 5.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. బెర్లిన్‌లో జరిగిన 30వ యూరోపియన్ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఇది అవార్డు దక్కించుకుంది. ఇక ఇప్పుడు అకాడమీ అవార్డుల రేసులో నిలవటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. -
ఆస్కార్‌పై కన్నేసిన అద్భుతం
-
మళ్లీ ఆస్కార్ రేస్‌లో ఎ.ఆర్. రెహమాన్
-
మళ్లీ ఆస్కార్ రేస్‌లో...
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2009)కి జంట ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అప్పటి నుంచి ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్లకు ‘127 హవర్స్’ చిత్రానికిగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్’ విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నారాయన. అయితే ఆస్కార్ వరించలేదు. తాజాగా మళ్లీ ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు. బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జీవితం ఆధారంగా రూపొందిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికి గాను రెహమాన్ ఆస్కార్ రేస్‌లో ఉన్నారు. ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెహమాన్ పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది. జనవరి 24న నామినేషన్ దక్కించుకున్నవారి వివరాలను ప్రకటిస్తారు. మరి.. ఈ నామినేషన్ ఎంట్రీ పోటీలో రెహమాన్‌కి స్థానం దక్కుతుందా? నామినేషన్ గెల్చుకుంటే ఆస్కార్ దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. -
మరోసారి ఆస్కార్ బరిలో ఏఆర్ రెహమాన్
-
ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి
ఆస్కార్ అవార్డ్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీపడేందుకు మన భారతీయ సినిమా ఎంపిక ప్రక్రియ మొదలైంది. మన దేశం తరఫున ఎంట్రీగా ఏ సినిమాను పంపాలనే దానికి పలు భాషా చిత్రాలను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. తెలుగు నుంచి పోటీ పడే అరుదైన అవకాశాన్ని ‘రుద్రమదేవి’ దక్కించుకుంది.‘‘తెలుగువారి చరిత్రకు, రుద్రమదేవి చరిత్రకు ఉన్న గొప్పతనమే ఈ సినిమాను ఈ స్థాయి దాకా తీసుకెళ్లింది’’ అని ఈ సందర్భంగా చిత్రదర్శక-నిర్మాత గుణశేఖర్ పేర్కొన్నారు. భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఇలాంటి కొన్ని చిత్రాలను పరిశీలించి ఫైనల్‌గా మన దేశం తరఫున ఎంట్రీగా ఒక చిత్రాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపిస్తుంది. -
ఆస్కార్‌కు సాయికుమార్ సినిమా
అంతర్జాతీయ సినీ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పోటీకి మన తెలుగు నటుడి సినిమా ఎంపికైంది. అయితే ఈ ఘనత సాధించింది తెలుగు సినిమా మాత్రం కాదు. దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా ఉన్న సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఆస్కార్ ఫైనల్స్‌కు ఎంపిక అయ్యింది. ఇటీవలే తాత అయిన సాయికుమార్ ఈ వార్తతో మరింత ఆనందంగా ఉన్నారు. కొత్త దర్శకుడు అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగితరంగ' కమర్షియల్ సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్స్‌కు చేరిన ఈ సినిమా వచ్చే నెల జరగనున్న 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో అవార్డు సాధించటం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. హీరోగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కొనసాగుతున్నారు. -
ఆస్కార్ రూట్ నుంచి డైవర్ట్ అయిన ది గుడ్ రోడ్
ఆస్కార్ అవార్డు అందుకోవాలనే కల దాదాపు ప్రతి కళాకారుడికి ఉంటుంది. కానీ, ఆ కల కొంతమందికే నెరవేరుతుంది. ఒకవేళ ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకోలేకపోయినా, కనీసం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ వరకూ వెళ్లినా ఫర్వాలేదనుకుంటారు. ఆస్కార్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక అసలు విషయానికొస్తే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ ఏడాది మన భారతదేశం నుంచి నామినేషన్ ఎంట్రీ పోటీలో గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’ నిలిచింది. ఇక, అప్పట్నుంచీ ఈ చిత్రం నామినేషన్ వరకూ వెళితే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. కానీ, ఆ కోరిక నెరవేరలేదు. ఎందుకంటే, నామినేషన్ వరకూ వెళ్లకుండానే ‘ది గుడ్ రోడ్’ ఆస్కార్ రూట్ నుంచి డైవర్షన్ తీసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ఎంట్రీకి ఎంపికైన తొమ్మిది చిత్రాల వివరాలను ఆస్కార్ అవార్డ్ కమిటీ ప్రకటించింది. వీటిలో ‘ది గుడ్ రోడ్’ లేకపోవడం ఆ యూనిట్ సభ్యులను నిరుత్సాహపరుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, నామినేషన్ దక్కించుకున్న ఇతర దేశాల చిత్రాల విషయానికి వస్తే... ‘ది బ్రోకెన్ సర్కిల్ బ్రేక్‌డౌన్ (బెల్జియమ్), ‘యాన్ ఎపిసోడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యాన్ ఐరన్ పికర్’ (బోస్నియా మరియు హెర్జెగోవినా), ‘ది మిస్సింగ్ పిక్చర్’ (కంబోడియా), ‘ది హంట్’ (డెన్మార్క్), ‘టూ లైవ్స్’ (జర్మనీ), ‘ది గ్రాండ్‌మాస్టర్’ (హంగ్‌కాంగ్), ‘ది నోట్‌బుక్’ (హంగేరి), ‘ది గ్రేట్ బ్యూటీ’ (ఇటలీ), ‘ఒమర్’ (పలెస్టైన్) ఉన్నాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు.. నామినేషన్ దక్కించుకున్నంత మాత్రాన ఫైనల్స్‌కి వెళతాయనడానికి లేదు. వీటిలో ఓ ఐదు చిత్రాలను ఎంపిక చేసి, ఫైనల్స్‌కి పంపిస్తారు. వచ్చే నెల 16న నామినేషన్ దక్కించుకున్న ఆ ఐదు చిత్రాల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. ఆ ఐదులో ఒక చిత్రాన్ని ఆస్కార్ వరిస్తుంది.