
తెలుగులో తన కొత్త ప్రయణాన్ని మొదలుపెట్టారు మలయాళ నటుడు దేవ్ మోహన్. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శకుంతలగా సమంత, దుష్యుంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు.
‘దిల్ ’రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం ‘శాకుంతలం’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు దేవ్ మోహన్ . ఈ సినిమా 2022లో విడుదల కానుంది.