
రేపు ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్
వరంగల్ కోటలో ఏర్పాట్లు
పరిశీలించిన దర్శకుడు, నిర్మాత గుణశేఖర్
ఖిలా వరంగల్ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాకతీయుల ఘన చరిత్ర, రుద్రమాదేవి పౌరుషాన్ని తెలుగుజాతి గర్వించే స్థాయిలో రుద్రమదేవి చిత్రం ద్వారా చాటిచెబుతామని ఆ సినిమా దర్శక, నిర్మాత గుణశేఖర్ అన్నారు. రుద్రమదేవి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ వరంగల్ మధ్యకోటలో ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్ కోటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖిలావరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు రుద్రమదేవి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ భారీ సెట్టింగ్‌ల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చిత్రం మొత్తం యూనిట్ సభ్యులతోపాటు సినీ హీరోరుు న్ ఆనుష్క రానున్నారని తెలిపారు.
శనివారం ఉదయం నుంచి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ సినిమాలో ముఖ్యంగా ఆరు పాటలు ఉంటాయని... మూడు పాటలను ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో శనివారం రిలీజ్ చేయనున్నామని, మిగిలిన మూడు పాటలు కోటలో విడుదల చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక నిపుణులతో రూ.70కోట్ల భారీ బడ్జెట్‌తో రుద్రమదేవి సినిమా తీసినట్లు చెప్పారు. తాను 8వ తరగతిలో చదువు కున్న రుద్రమదేవి పాఠ్యాంశాన్ని సినిమాగా తీయాలనే సంకల్పంతోనే ఈ చిత్రాన్ని నిర్మించానన్నారు. తాను నమ్ముకున్న కథను తానే తీయాలని ప్రయత్నించి.. విజయం సాధించానని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు అద్భుతంగా ఉన్నాయని వివరించారు. కాకతీయ చక్రవర్తుల శౌర్య పరాక్రమాలు, నాటి పాలన తీరును ఇందులో వివ రించినట్లు తెలిపారు. రుద్రమదేవి పుట్టుక నుంచి యుద్ధంలో వీరమరణం పొందే వరకు స్టిరియో క్రోమ్ త్రీడి రూపంలో చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ డీఎస్సీ సురేంద్రనాథ్, మిల్స్‌కాలని సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.