డూప్ లేకుండా పోరాటాలు! | Allu Arjun didn't use dupe for action sequences : Gunasekhar | Sakshi
Sakshi News home page

డూప్ లేకుండా పోరాటాలు!

Published Tue, Aug 19 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

డూప్ లేకుండా పోరాటాలు!

డూప్ లేకుండా పోరాటాలు!

వీరత్వానికి ప్రతీక గోన గన్నారెడ్డి. కాకతీయ చరిత్రలో ఆయన ఘట్టం మరపురానిది. త్వరలో ఈ పాత్రలో అల్లు అర్జున్ తెరపై కనిపించబోతున్నారు.

 వీరత్వానికి ప్రతీక గోన గన్నారెడ్డి. కాకతీయ చరిత్రలో ఆయన ఘట్టం మరపురానిది. త్వరలో ఈ పాత్రలో అల్లు అర్జున్ తెరపై కనిపించబోతున్నారు. బన్నీ పోషించిన తొలి చరిత్రాత్మక పాత్ర ఇదే కావడం విశేషం. కాకతీయ సామ్రాజ్ఞి రాణీరుద్రమదేవి చరిత్ర ఆధారంగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్ అనుష్క పోషిస్తున్న ఈ చిత్రంలోనే గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఈ పాత్ర చిత్రీకరణ కూడా పూర్తయింది.
 
 ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘బన్నీ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రాబిన్‌హుడ్ తరహాలో యువతని, మాస్‌ని విశేషంగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది. జూలై 4 నుంచి 30 రోజుల పాటు ఈ పాత్ర చిత్రీకరణ జరిపాం. అద్భుతంగా వచ్చింది. పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో ప్రేక్షకుల్ని సంభ్రమకు లోనుచేసేలా సన్నివేశాలు పడ్డాయి. పీటర్‌హేన్స్ నేతృత్వంలో డూప్ లేకుండా బన్నీ చేసిన పోరాట సన్నివేశాలు ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ పోరాట దృశ్యాలను తెరకెక్కించాం. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement