రాణిని చేజిక్కించుకున్న దిల్ రాజు
తెలుగు తెరపై జేజమ్మగా ఆలరించిన అనుష్క ప్రస్తుతం రాణి పాత్రలతో జోరును కొనసాగిస్తోంది.
తెలుగు తెరపై జేజమ్మగా ఆలరించిన అనుష్క ప్రస్తుతం రాణి పాత్రలతో జోరును కొనసాగిస్తోంది. చారిత్రాత్మక నేపథ్యమున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో రాణిగా కొత్త అవతారంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమ దేవి చిత్రానికి సంబంధించిన నైజాం, వైజాగ్ ప్రాంతాల హక్కుల్ని ఓ ఫ్యాన్సీ రేట్ ను చెల్లించి ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
దిల్ రాజు పంపిణీ చేసే చిత్రాలు విజయం సాధిస్తుందనే నమ్మకం కారణంగా రుద్రమ దేవి విజయంపై మరింత అంచనాలు పెంచాయి. భారీ సెట్టింగులతో ఆలరించే గుణశేఖర్ చిత్రాన్ని దిల్ రాజు సొంతం చేసుకోవడంతో రుద్రమదేవి చిత్రంపై కొత్తగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, బాబా సెహగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.