
గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇందులో శకుంతల పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? అనే చర్చ చాన్నాళ్లు నడిచింది. ఫైనల్లీ శకుంతలగా సమంత చేయనున్నారని గుణ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించడంతో... ఆ తర్వాత చర్చ అంతా దుష్యంతుడి పాత్ర చుట్టూ తిరిగింది. శనివారం ఈ చర్చకు కూడా ఫుల్‌స్టాప్ పడింది.
ఈ పాత్రకు మలయాళ నటుడు దేవ్ మోహన్‌ని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇతిహాసంలో దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు గుణశేఖర్. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేయిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రేమకావ్యం త్వరలో సెట్స్‌కి మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
Comments
Please login to add a commentAdd a comment