
సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. మధ్య మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకునేది. ఇలా ఏదో ఒక రకంగా సోషల్ మీడియాతో టచ్‌లో ఉండే సామ్.. సడెన్‌గా నెట్టింటికి దూరమైపోయింది. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి రెండు వారాలు దాటింది.
సమంత చివరిగా జూన్ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు దూరమై పోయింది. ట్విటర్‌లో కూడా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఆ మధ్య సామ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిందని ఆమె టీమ్ పేర్కొంది.
ఆ తర్వాత సమంత నుండి ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ లేదు. తరచు తన ఫోటోలను అప్‌లోడ్ చేసే సామ్... 15 రోజులు గడిచిన ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో ఆమె ఫాలోవర్స్‌లో ఆందోళన మొదలైంది. సామ్ ఎందుకు నెట్టింటికి రాలేకపోతుంది? సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉందా? లేదా కావాలనే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందా అనే చర్చ నెట్టింట మొదలైంది.
కొంతమంది ఆమె సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉందని అంటుంటే.. మరికొంతమంది వ్యక్తిగత కారణాల వల్లే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని అంటున్నారు. సమంత ఇంత సైలెంట్‌గా ఉందంటే.. ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూస్‌తో రీఎంట్రీ ఇస్తుందని మరికొంత మంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సామ్..ఎందుకు సడెన్‌గా సైలెంట్ అయిందో తెలియాలంటే సామ్ స్పందించేవరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment