దేవర సాంగ్‌ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్‌బంప్సే! | Sakshi
Sakshi News home page

Devara First Single Promo: దేవర సాంగ్‌ ప్రోమో.. దద్దరిల్లిపోయేలా బీజీఎం!

Published Fri, May 17 2024 7:57 PM

Jr Ntr Devara First Single Fear Song Promo Out Now

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్‌ సింగిల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్‌లోని హుకుమ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసి అనిరుధ్‌ తనదైన మార్క్‌ చూపించారు. దీంతో దేవర సాంగ్‌ తర్వాత హుకుమ్‌ సాంగ్‌ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్‌ చేయడంతో గూస్‌ బంప్స్‌ ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement