ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ'.. మరో అప్‌డేట్‌ వచ్చేసింది! | Prabhas Kalki 2898 AD Movie Latest Update Goes Viral | Sakshi
Sakshi News home page

kalki 2898 AD Movie: టూర్‌లో బిజీగా బుజ్జి.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌!

Published Fri, Jun 14 2024 9:40 PM | Last Updated on Sat, Jun 15 2024 10:57 AM

Prabhas Kalki 2898 AD Movie Latest Update Goes Viral

ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్‌, దిశాపటానీ లాంటి స్టార్స్‌ నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది.

కల్కి విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో బుజ్జిని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిప్పుతున్నారు. ప్రస్తుతం బుజ్జి రాజస్థాన్‌లోని జైపూర్‌లో సందడి చేయనుంది. ఈనెల 15,16 తేదీల్లో బుజ్జి టూర్‌కి సిద్ధమైంది. అంతే కాకుండా ఈ నెల 15న కల్కి ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ‍దిల్జీత్‌ దోసాంజ్‌ ఈ సాంగ్‌ను పాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement