
రజనీకాంత్... ఈ పేరే ఒక సంచలనం. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడే కాదు, దేశ విదేశాల్లోనూ తలైవాకు తిరుగులేని అభిమానగణం ఉంది. ఈ సూపర్‌స్టార్‌కు మాములు ప్రేక్షకులే కాదు... సెలబ్రెటీలు కూడా అభిమానులే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రజనీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్ ప్రేక్షకులు ఆయనను తమిళ దైవంగా ఆరాధిస్తారు. అలాంటి సూపర్‌స్టార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూనే ఉంటారు. రజనీ సినిమాకు సంబంధించి ఏ చిన్నవిషయమైనా వీరికి పండగే.
కొద్ది క్షణాల క్రితమే రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ మొదటి పాటను విడుదల చేశారు. యమ గ్రేటే.. యమ గ్రేటే...అంటూ సాగే ఈ పాట రజనీ కోసమే పుట్టిందేమో అన్నట్లు ఉంది. ఈ ఒక్క పాటలోనే సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూపించేశారు. రజనీ కాలాగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నారో ఈ పాటను వింటే తెలుస్తోంది. ధారావి ప్రాంతంలో కాలాకు ఉండే పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. ఈ పాటను హరిహరసుదన్, సంతోష్ నారాయణ్ ఆలపించగా...సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ చూడ్డానికి కూడా బాగుంది. ఇక ఈ పాటతో కాలా విడుదలయ్యే వరకు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment