Allu Arjun Pushpa 2 The Rule Movie First Song Pushpa Pushpa Lyrical Video Out, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule First Song: 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే'.. ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది!

Published Wed, May 1 2024 5:05 PM | Last Updated on Wed, May 1 2024 7:13 PM

Allu Arjun Pushpa 2 The Rule First Single Out Now

ఐకాన్‌ స్టార్‌ అల్లు  అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్‌ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

గతనెల బన్నీ బర్త్‌ డే సందర్భంగా టీజర్‌ విడుదల చేసిన మేకర్స్‌.. మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్‌ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్‌లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్‌గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement