‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఈ రోజు (ఆదివారం) విడుదల చేశారు. మహేష్ లుక్ కు తగ్గట్టుగా ఈ పాటను కూడా స్టైలిష్‌గా రూపొందించారు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హాలీవుడ్ పాటలను గుర్తు చేసేలా క్లాస్ ట్యూన్‌తో ఆకట్టుకున్నాడు.
రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించిన ఈ పాటను డేవిడ్ సిమాన్ ఆలపించారు. మహేష్ బాబు ముఖ్య మంత్రిగా నటించనున్న భరత్ అనే నేను సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మహేష్ ఈ సినిమాతో ఎలాగైన బిగ్ హిట్ కొట్టి అభిమానులను ఖుషీ చేయాలని చూస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment