హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రాఖీ పర‍్వదిన్నాన్ని పురస్కరించుకొని అభిమానులకు మంచి గిఫ్ట్ అందించారు. తన రాబొయే చిత్రం `యుద్ధం శరణం` సినిమాలోని ఓ పాటను రాఖీ బహుమతిగా అభిమానులకు నాగచైతన్య అందజేశారు. ఈ సినిమాలోని `ఎన్నో ఎన్నో భావాలే` అనే పాట లిరికల్ వీడియోను నాగచైతన్య ట్విట్టర్‌లో షేర్ చేశారు ఈ పాటను దర్శకుడు కృష్ణ వైరముత్తుతో కలిసి రేడియో మిర్చిలో విడుదల చేసినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అంటూ సీనియర్ నటి రేవతి డైలాగ్.... నాగచైతన్యకు రాఖీ కడుతున్న సన్నివేశంతోనే ఈ వీడియో మొదలవుతోంది. అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠికి, నాగచైతన్యకు మధ్య ఉన్న కొన్ని చక్కని సన్నివేశాలను కూడా ఈ వీడియోలోలో పొందుపరిచారు. కుటుంబ బంధాలను, వారితో గడిపిన సంతోష క్షణాలను ఈ వీడియోలో చూడొచ్చు.
కాగా హీరో, నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రను పోషిస్తుండగా, నాగచైతన్య తల్లిదండ్రులుగా రావురమేశ్, రేవతిలు నటించారు. వివేక్‌సాగర్ సంగీతం అదించిన సంగతి తెలిసిందే.
సంగతి తెలిసిందే.
రాఖీ పండుగకి నాగ్ గిఫ్ట్ ఇదే..
Published Mon, Aug 7 2017 2:52 PM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
Advertisement
Advertisement