అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ? | How To Find The Song Name Without Knowing The Lyrics | Sakshi
Sakshi News home page

అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ?

Published Thu, Jun 17 2021 2:23 PM | Last Updated on Thu, Jun 17 2021 4:09 PM

How To Find The Song Name Without Knowing The Lyrics - Sakshi

ఇలా మీకు చాలాసార్లు జరిగి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్‌ తో కలిసి రెస్టారెంట్‌కో, లేదంటే లాంగ్‌ డ్రైవింగ్‌కి వెళ్లే సమయంలో ఎఫ్‌ఎమ్‌ లో మీకు నచ్చిన పాట ప్లే అవుతుంది. అరే ఈ పాటేదో బాగుందే. ఆ ఆల్బమ్‌ ను కొనుక్కోని మరోసారి వినాలని'అనుకుంటారు. కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే మీకు ఆ సాంగ్‌ లిరిక్‌ తెలియదు. ఏ ఆల్బమ్‌ లోని పాటో గుర్తించలేరు. కానీ ఈ చిన్న టిప్స్‌తో మీకు నచ్చిన సాంగ్స్‌ ను చిటికెలో కనిపెట్టేయోచ్చు.  

ఆ సాంగ్‌ పేరేంటో? లిరిక్స్‌ ఏంటో తెలియదా?  

మీకు ఇష్టమైన సాంగ్‌ గురించి గూగుల్‌ లో మీకు నచ్చిన విధంగా సెర్చ్‌ చేస్తుంటారు. ఆ పాటకు సంబంధించిన ఆల్బమ్‌ పేరు, పాడింది ఎవరో ఒక క్లూ దొరకుతుంది. మరి ప్రత్యేకంగా మీకు నచ్చిన సాంగ్‌ ను ఎలా గుర్తించాలి. సింపుల్‌. 

1. షాజామ్: షాజామ్ అనే  ఫ్రీ మొబైల్‌ అప్లికేషన్‌ ను మీ ఫోన్‌ లో డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. డౌన్‌ లోడ్‌ అనంతరం ఆడియో సోర్స్‌ లో ట్యాగ్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే మీకు మీకు నచ్చిన సాంగ్‌ ప్లే అవుతుంది. కాకపోతే ఈ సదుపాయం కేవలం ప్రీ రికార్డ్‌ సాంగ్స్‌ కు మాత్రమే ఉంది. లైవ్‌ సాంగ్స్‌ కు అనుమతిలేదు. ఇక అన్‌ లిమిటెడ్‌ కావాలనుకుంటే నెలకు రూ.900పే చేయాల్సి వస్తుంది.    

2. మ్యూజిక్‌ ఐడియా : అనే యాప్‌ ను ఐఫోన్‌ లో ఇన్‌ స్టాల్‌ చేసుకొని మీకు నచ్చిన సాంగ్‌ పాడితే .. వెంటనే ఆ పాట ప్లే అవుతుంది. పెయిడ్‌ వెర్షన్‌ కింద నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.  

3. వాయిస్‌ తో సాంగ్‌ ను గుర్తించడం ఎలా?  

మిడోమీ : ముందుగా ఫ్రీ వెర్షన్‌లో ఉన్న మిడోమీ అనే యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ సెట్‌ తగిలించుకొని  యాప్‌ లో 'అన్‌నోన్‌' అనే ఆప్షన్‌ క్లిక్‌ చేసి పాట పాడితే.. మీరు పాడిన పాట ఏ ఆల్బమ్‌, ఏ సినిమాలోనిదో ఇట్టే చెప్పేస్తుంది.  
 
4. ఆడియో ట్యాగ్ : ఆడియో ట్యాగ్‌ లో మీకు నచ్చిన సాంగ్‌ను సిస్టమ్‌లో రికార్డ్‌ చేసి ఉంటే ఆడియో ట్యాగ్‌ యాప్‌ లో అప్‌ లోడ్‌ చేయాలి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే మీకు నచ్చిన సాంగ్‌, ఆ సాంగ్‌ కు సంబంధించిన వివరాలు ఆడియో డేటా బేస్‌ లో డిస్‌ప్లే అవుతాయి.  

చదవండి: Facebook: కొత్త ఫీచ‌ర్ గురించి తెలుసా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement