
సినీ గీత రచయితగా కపిల్ సిబల్!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సినీ గీత రచయిత అవతారమెత్తారు. ‘జైనాబ్- ఏ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమానిటీ’ అనే సినిమాకు ఖవ్వాలి పాటతో సహా 7 పాటలను రాశారు. ఉత్తరప్రదేశ్‌లో 2011 నుంచి ఇటీవలి వరకూ మహిళలపై జరిగిన వేధింపులను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్‌ను శనివారం సిబల్ ఆవిష్కరించారు.
సామాజిక సందేశం ఇచ్చేందుకు సినిమా ప్రభావవంతమైన మాధ్యమమని, ఈ సినిమా ద్వారా సంతోషం, మత సామరస్యం వంటి అంశాలను తెలియజేయాలని భావించామన్నారు. ‘మన మనస్తత్వం మారేంత వరకూ ఏ చట్టమూ సమాజంలో మార్పు తీసుకురాలేద’న్నారు. జైనాబ్ (మహ్మద్ ప్రవక్త కూతురు) సినిమాకు ప్రణవ్ సింగ్ దర్శక నిర్మాత .