ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్‌ | Star Hero Simbu Maanadu,Rewind official teaser | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్‌

Published Wed, Feb 3 2021 5:02 PM | Last Updated on Wed, Feb 3 2021 5:43 PM

Star Hero Simbu Maanadu,Rewind official teaser - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు నటిస్తున్న  ‘మానాడు’ మూవీ  టీజర్‌ను  విడుదలైంది. టాలీవుడ్‌  మాస్‌ మహారాజా రవితేజ ‘మానాడు’ టీజర్‌ను  బుధవారం రిలీజ్‌ చేశారు. శింబు పుట్టినరోజు సందర్బంగా  రిలీజ్ చేసిన ఈ టీజర్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సందర్భంగా రవితేజ​ శింబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అలాగే టీమ్‌కు కూడా అభినందనలు తెలిపారు. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.

‘రివైండ్‌’ పేరుతో  పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో  శింబు ముస్లింగా కనిపించనున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  టైమ్ ఎవరి గురించి వెయిట్ చేయదు.. ఒకవేళ వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ మూవీలో నటిస్తుండడం మరో విశేషం. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి నిర్మిస్తున్న ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా  సంగీతం మరో హైలైట్‌గా నిలవనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement