ఈనాడు పండుగే పండుగ | Karthi Telugu Movie  Donga Enaadu Panduge Pandaga Video Song   | Sakshi
Sakshi News home page

ఈనాడు పండుగే పండుగ

Published Fri, Dec 6 2019 7:35 PM | Last Updated on Fri, Dec 6 2019 7:52 PM

Karthi Telugu Movie  Donga Enaadu Panduge Pandaga Video Song   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఖైదీ సినిమా భారీ విజయంతో తెలుగులో మరోసారి మంచి జోష్‌ మీద ఉన్న కార్తీ త్వరలోనే దొంగ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను అందుకునేందుకు సిద్ధమవు తున్నాడు.  కార్తీ అప్‌ కమింగ్‌ మూవీ  ‘దొంగ’  సినిమా పోస్టర్స్‌కి, టీజర్‌తోపాటు  రూపీ రూపీ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో  ప్రేక్షకుల అంచనాలు ఇలానే ఉన్నాయి.

కార్తీకి నిఖిలా విమల్ జంటగా నటిస్తున్న మరో సూపర్‌ హీరోయిన్‌ జ్యోతిక (హీరో సూర్య భార్య), సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈనాడు పండగే పండగే అనే వీడయో పాటు చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. అన్సన్ పాల్, ఇలావరసు, అమ్మూ అభిరామి, షావుకారు జానకి, సీత, అశ్వంత్ అశోక్‌ కుమార్‌, రమేష్ తిలక్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా, వయాకామ్ 18 స్టూడియోస్‌, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరులో అన్ని భాషల్లోనూ  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా రంజింత్ గోవింద్ స్వరాలు కూర్చారు. ఎప్పటిలాగానే గాయని చిన్మయి శ్రీపాద తన స్వరంలో మెలోడీతో మ్యాజిక్‌ చేశారు. ఒకవైపు కేరళ అందాలు అలరిస్తోంటే.. రూపి రూపి పాటలో లాంగ్ హెయిర్‌తో..విలక్షణంగా ఆకట్టుకున్న కార్తీ  తాజా సాంగ్‌లో మాత్రం రఫ్‌ లుక్‌తో ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement