'పూరీ సినిమాలో మహేష్ పాత్ర అదుర్స్' | ramgopal varma lauds puri jagannath, mahesh babu upcoming movie | Sakshi
Sakshi News home page

'పూరీ సినిమాలో మహేష్ పాత్ర అదుర్స్'

Published Thu, May 14 2015 10:39 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'పూరీ సినిమాలో మహేష్ పాత్ర అదుర్స్' - Sakshi

'పూరీ సినిమాలో మహేష్ పాత్ర అదుర్స్'

పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా మీద వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను పూరీ జగన్ స్టోరీ విన్నానని, ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల కంటే బెస్ట్ అని అన్నాడు. ఈ కొత్త సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ సృష్టించిన అన్ని పాత్రల కంటే, అలాగే మహేష్ పోషించిన అన్ని పాత్రల కంటే పది రెట్లు బాగుందని చెప్పాడు.

ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర, డైలాగులు సన్నీ లియోన్ కంటే పది రెట్లు సెక్సీగా ఉంటాయని, పోకిరీ, బిజినెస్మ్యాన్, దూకుడు కంటే కూడా పదిరెట్లు బాగుంటాయని వర్మ తెలిపాడు. తాను విన్న స్టోరీ ప్రకారం అయితే పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తారని, హీరోయిజం కూడా హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతుందని రాంగోపాల్ వర్మ చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement