
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. (ప్రభాస్ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా ఆ మైల్‌స్టోన్..)
`మహానటి`కి పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నట్లు వైజయంతి సంస్థ పోస్టర్‌ను రిలీజ్‌ను చేసింది. అలాగే మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రభాస్..తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సలార్’షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్ షూటింగ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు. అన్నీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే. మరో రెండుమూడేళ్ల వరకూ ప్రభాస్ కాలెండర్ ఫుల్ బిజీ. (ఒలీవియా మోరిస్ బర్త్‌డే.. ఫస్ట్‌లుక్ విడుదల)
Comments
Please login to add a commentAdd a comment