సీసీసీకి వైజ‌యంతీ మూవీస్‌ రూ. 5 ల‌క్ష‌లు విరాళం | Vyjayanthi Movies Donates 5 Lakhs For Corona crisis Charity | Sakshi
Sakshi News home page

సీసీసీకి వైజ‌యంతీ మూవీస్‌ రూ. 5 ల‌క్ష‌లు విరాళం

Apr 13 2020 5:04 PM | Updated on Apr 13 2020 5:17 PM

Vyjayanthi Movies Donates 5 Lakhs For Corona crisis Charity - Sakshi

కరోనా నియంత్రణకు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌ తాజాగా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మ‌రో రూ. 5 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించింది. ఇంతకముందే క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేసిన విషయం తెలిసిందే.  ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు వైజ‌యంతీ మూవీస్ అంద‌జేసిన‌ క‌రోనా విరాళం మొత్తం రూ. 25 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వెన్నెముక అయిన దిన‌స‌రి వేత‌నంతో ప‌నిచేసే కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి సీసీసీకి రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ప్ర‌క‌టించింది. (మీకు అమ్మ, అక్కాచెల్లెళ్లు లేరా..)

సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి సీసీసీని ఏర్పాటు చేయ‌డాన్ని తాము మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నామ‌నీ, చిత్ర‌సీమ‌లోని మిగ‌తా ప్ర‌ముఖులంతా ఈ మంచి ప‌నికి తోడ్పాటునివ్వాల‌ని కోరింది. ప్ర‌జలంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని, క‌రోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్ర‌భుత్వాల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని వైజయంతి సంస్థ విజ్ఞ‌ప్తి చేసింది. (పుష్ప: విల‌న్‌గా బాలీవుడ్ అగ్ర న‌టుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement