
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ‘వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం’అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రభాస్‌తోనే చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ తీసింది రెండు చిత్రాలైనప్పటికీ విభిన్నంగా ఆలోచించే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు పక్కా కమర్షియల్ కథను నాగ్ అశ్విన్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మహర్షి తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పుడు అందరి కన్ను పడింది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ఫేమ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాతనే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది.
Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020
చదవండి:
చిరు సినిమాలో మహేశ్‌బాబు..!
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'