నమస్కారం బిగ్‌ బీ | Amitabh Bachchan Joins Prabhas And Deepika Padukone In New Film | Sakshi
Sakshi News home page

నమస్కారం బిగ్‌ బీ

Published Sat, Oct 10 2020 12:59 AM | Last Updated on Sat, Oct 10 2020 12:59 AM

Amitabh Bachchan Joins Prabhas And Deepika Padukone In New Film - Sakshi

ప్యాన్‌ ఇండియా సరికొత్త సూపర్‌స్టార్‌ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ 50 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా అశ్వినీదత్‌ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో భారతీయ సినిమా గర్వించదగ్గ ఆర్టిస్ట్‌ అమితాబ్‌గారు భాగమవ్వడం చాలా సంతోషం.

ఆయనకు స్వాగతం పలకడం నాకు లభించిన అద్భుతమైన, అత్యంత సంతృప్తికర క్షణం’’ అన్నారు. ‘‘అమితాబ్‌ బచ్చన్‌గారితో నటించాలనే నా కల ఎట్టకేలకు నిజమౌతోంది. నమస్కారం బిగ్‌ బీ’’ అన్నారు ప్రభాస్‌. ‘‘అమితాబ్‌గారికి ఎన్నో ఆఫర్లు వస్తాయి. వాటిలో మా సినిమా అంగీకరించడం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయనది కేవలం అతిథి పాత్రో, ప్రత్యేక పాత్రో కాదు. కథకు చాలా ముఖ్యమైన పాత్ర. బిగ్‌ బీ మాకు కేటాయించిన సమయానికి న్యాయం చేస్తాం’’ అన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. 2021లో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2022లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement