Prabhas Project K Movie Team Clarifies Rumours Over Shooting Postponed - Sakshi
Sakshi News home page

Project K: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్‌ కె’ టీం క్లారిటీ

Published Sat, Jun 18 2022 8:26 AM | Last Updated on Sat, Jun 18 2022 10:21 AM

Prabhas Project K Movie Team Clarifies Rumours Over Shooting Postponed - Sakshi

‘డార్లింగ్‌’ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దీపికా ఆస్వస్థకు గురవడంతో ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలను కోరాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రూమర్లపై చిత్ర బృందం స్పందించింది. ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌

ఇక్కడ షూటింగ్‌లో పాల్గొన్న దీపికా అస్వస్థగా అనిపించడంతో కామినేని ఆసుప్రతిలో చెకప్‌ చేయించుకుంది. దీంతో ఆప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. ప్లాన్‌ చేసుక్ను ప్రకారం సజావుగా జరుగుతోంది’ అని మూవీ నిర్మాత నిర్మాత అశ్వనీదత్‌ తెలిపాడు. అయితే ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం దీపికా యూరప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఆమె ప్రాజెక్ట్‌ కె కోసం నేరుగా హైదరాబాద్‌ వచ్చింది.  

చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య

అయితే గతేడాది దీపికా కరోనా బారిన పడ్డిన విషయం విధితమే. ఆ సమయంలో తన గుండె వేగంగా కొట్టుకునేదట. తాజాగా అలానే అనిపించడంతో చెకప్‌ కోసం దీపికా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లొచ్చింది. దీంతో ఆమె రెండు గంటల ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ను వెళ్లింది. ​కాగా ప్రస్తుతం దీపికా, అమితాబ్‌ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లోని సీన్స్‌ ఈ నెల 20తో పూర్తవుతాయట. ఆ తర్వాత ఈ నెల 21 నుంచి ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజుల పాటు జరగనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement