Producer Ashwini Dutt Daughter Swapna Dutt About Jr NTR | I Got Married Because Of NTR - Sakshi
Sakshi News home page

JR NTR-Ashwini Dutt Daughter: ‘తారక్‌ వల్లే నా పెళ్లి జరిగింది’

Published Wed, Aug 24 2022 10:42 AM | Last Updated on Wed, Aug 24 2022 11:46 AM

Producer Ashwini Dutt Daughter Swapna Dutt about Jr NTR - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాత నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనదైన నటన, డాన్స్‌ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎంతపెద్ద స్టార్‌ అయిన ఒదిగిపోయే ఉండే ఆయన వ్యక్తిత్వం చూసి అంత ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారక్‌కు సాధారణ ప్రజలే కాదు ఇండస్ట్రీలోనూ అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రముఖ బడా నిర్మాత అశ్వినీదత్‌ కూతురు స్వప్నాదత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటున్న నటి సురేఖ వాణి

ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తారక్‌ వల్లే తన పెళ్లి జరిగిందని చెప్పంది.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా వివాహం జరగడానికి జూనియర్‌ ఎన్టీఆరే కారణం. పెళ్లికి ముందు తన భర్త ప్రసాద్‌ వర్మ, తాను కొంతకాలం ప్రేమించుకున్నాం. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు(వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ అధినేత అశ్వినీదత్‌) చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే నాన్న నా ప్రేమను కచ్చితంగా నిరాకరిస్తారని తెలుసు. అయితే ఈ విషయాన్ని నేను శక్తి మూవీ షూటింగ్‌ సమయంలో తారక్‌తో పంచుకున్నా. తను వెంటనే ఇంట్లో చెప్పమని సలహా ఇచ్చాడు.

చదవండి: లైగర్‌ మూవీ ఫ్లాప్‌ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

‘ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. మీ నాన్నగారితో నేను మాట్లాడుతా’ అని చెప్పి షూటింగ్‌ అయిపోయాక మా ఇంటికి వచ్చి నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాడు. మొదట ఆయన కాస్తా సీరియస్‌ అయినా ఆ తర్వాత తారక్‌ తన మాటలతో నాన్నను ఒప్పించాడు. అలా మా పెళ్లికి తారక్‌ మూలకారణం అయ్యాడు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా స్వప్నా దత్‌ ప్రసాద్‌ వర్మను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి 2010లో జరిగింది. తండ్రి అనంతరం ప్రస్తుతం వైజయంత్‌ బ్యానన్‌ వ్యవహారాలు, బాధ్యతలను స్వప్నాదత్‌ ఆమె సోదరి ప్రియాంక దత్‌లు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement