
మహతి, మణిశర్మ, అశ్వనీదత్, నాని, శ్రీరామ్ ఆదిత్య
నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీ శనివారం హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైంది. సాంగ్స్ రికార్డింగ్‌తో స్టార్ట్ చేశారు. నాగ్‌కి ఈ బేనర్లో సినిమా చేయడం కొత్త కాదు. ఆఖరి పోరాటం, ఆజాద్, రావోయి చందమామ వంటి సినిమాలు చేశారు. నానీకి మాత్రం ఈ బేనర్లో ఫస్ట్ మూవీ.
చిత్రనిర్మాత సి.అశ్వనిదత్ మాట్లాడుతూ– ‘‘నాగార్జున, నాని కాంబినేషన్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఎంటర్‌టైన్మెంట్ అంశాలు కొదవ లేకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ ప్రారంభించాం. మార్చిలో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘వైజయంతి మూవీస్ వంటి పెద్ద బ్యానర్‌లో నాగార్జున, నాని కాంబినేషన్‌లో మూవీని డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది దర్శకుడిగా నాకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి.
Comments
Please login to add a commentAdd a comment